జూబ్లీహిల్స్ సొసైటీ స్కాం.. రేవంత్‌రెడ్డికి నోటీసులు

-మరో 11 మందికి కూడా జారీ -15 రోజుల్లో హాజరుకావాలన్న పోలీసులు -హైకోర్టు ఆదేశాలతో దర్యాప్తులో వేగం -జవాబివ్వడానికి సమయం కోరిన రేవంత్
హైదరాబాద్ సిటీబ్యూరో/బంజారాహిల్స్, నమస్తే తెలంగాణ: జూబ్లీహిల్స్ సొసైటీ స్కాంలో కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డికి పోలీసులు నోటీసులు జారీచేశా రు. నకిలీపత్రాలతో జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ సొసై టీ భూములను విక్రయించి, కోట్లరూపాయల స్కామ్‌కు పాల్పడిన ఆరోపణలతో ఆయనపై కేసు నమోదయిన సంగతి తెలిసిందే.. తాజాగా ఈ కేసుకు సంబంధించి హైకోర్టు ఆదేశాలతో చార్జిషీట్ దాఖలుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న రేవంత్‌రెడ్డితోపాటు 12మందికి జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం నోటీసులు పంపించారు. నోటీసులు అందుకున్నవారంతా పదిహేను రోజుల్లోగా జూబ్లీహిల్స్ పోలీసుల ముందు హాజరుకావాలని ఆదేశించారు. ఈ కేసుకు సంబంధించి విచారణ ఆలస్యమవుతున్నదని న్యాయవాది ఇమ్మనేని రామారావు ఉన్నత న్యా యస్థానాన్ని ఆశ్రయించడంతో హైకోర్టు స్పందించింది.

ఫోర్జరీ డాక్యుమెంట్ల సృష్టికర్త

జూబ్లీహిల్స్ కో అపరేటివ్ సొసైటీ సభ్యుడిగా ఉన్న సమయంలో రేవంత్‌రెడ్డి.. మరికొందరు కలిసి ప్రజావసరాలకోసం కేటాయించిన స్థలాలకు, నకిలీ పత్రా లు సృష్టించి.. ప్లాట్లుగాచేసి విక్రయించినట్టు కేసు ఫైల్ అయింది. ఈ వ్యవహారంపై కో అపరేటివ్ సొసైటీ 2002లో వేసిన కమిటీ అవకతవకలు జరిగినట్టు నిర్ధారించింది. జాయింట్ రిజిస్ట్రార్ అఫ్ కో అపరేటివ్ సొసైటీ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదుచేయడంతో 2002/326 క్రైమ్ నంబర్‌తో 468, 471, 406, 129(బి) సెక్షన్ల కింద కేసు నమోదయింది. రేవంత్‌రెడ్డితోపాటు సరళ ఆర్ ప్రసాద్, సురేశ్ నల్లారి, జీ నర్సింహారావు, టీఎల్ ప్రసాద్, వై గౌరి, వీ సుమిత్రారెడ్డి, ఎం జయశ్రీరెడ్డి, బీ వరలక్ష్మి, జగ్గారావు, హర్షవర్ధన్‌రెడ్డి, విష్ణురావుకు నోటీసులిచ్చారు. ఈ కేసుకు సంబంధించిన మరింత సమాచారం కావాలంటూ కో ఆపరేటివ్ డిపార్ట్‌మెంట్, న్యాయవాది రామారావులకు కూడా నోటీసులు అందించినట్టు బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్‌రావు తెలిపారు.

హైకోర్టు స్టేతో విచారణ ఆలస్యం

రేవంత్‌రెడ్డి 2002లో వేసిన రిట్ పిటిషన్‌తో హైకోర్టు స్టే విధించింది. ఈ స్టే 2014 వరకు కొనసాగింది. 2014లో ఈ కేసును త్వరగా విచారణ చేయాలం టూ న్యాయస్థానం ఆదేశించింది. ఈ ఆదేశాలపైనా రేవంత్‌రెడ్డి రివ్యూ పిటిషన్ దాఖలుచేశారు.పిటిషన్ ను న్యాయస్థానం 2018లో కొట్టేసింది. విచారణను వేగవంతంచేసి, త్వరగా చార్జిషీట్‌ను దాఖలుచేయాలంటూ పోలీసులను ఆదేశించింది. పోలీసులు ఈ కేసు విషయం పట్టించుకోకపోవడంతో జూన్ 14, 2018న న్యాయవాది ఇమ్మనేని రామారావు జూబ్లీహిల్స్ పోలీసులకు మరోసారి ఫిర్యాదుచేశారు. ఈ కేసును ఎందుకు దర్యాప్తుచేయడంలేదంటూ, ప్రభు త్వ అధికారులు ఈ కేసును ముందుకు తీసుకెళ్లడంలేదని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదుచేయడంతో దర్యాప్తు వేగవంతమమయింది.

× RELATED అద్భుత విజయం సాక్షిగా బంగారు తెలంగాణ