పది లక్షల మందికి కండ్లద్దాలు

-51,66,689 మందికి కంటి పరీక్షలు -2,903 గ్రామాల్లో వైద్యశిబిరాలు పూర్తి -జీహెచ్‌ఎంసీ పరిధిలో పదిలక్షల మందికి పరీక్షలు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అంధత్వరహిత తెలంగాణ సాధన దిశగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమంలో బుధవారం నాటికి దాదాపు పది లక్షలమందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. కంటివెలుగు ప్రారంభమైన నాటినుంచి మొత్తం 35 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,903 గ్రామాలు, 202 వార్డుల్లో నిర్వహించిన వైద్య శిబిరాల్లో 51,66,689 మందికి కంటి పరీక్షలు చేశారు.

9,98,797 మందికి రీడింగ్ అద్దాలను అందజేశారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 1,17,717 మందికి పరీక్షలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో కంటి వెలుగు దిగ్విజయంగా సాగుతున్నది. 30 సర్కిళ్ల పరిధిలో బుధవారంనాటికి 10,49,718 మం దికి కంటి పరీక్షలు నిర్వహించారు. బుధవారం 24,017 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించినట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిషోశోర్ తెలిపారు. ఇందులో 4,912 మందికి కండ్లద్దాలు ఇవ్వగా, 1,253 మందికి శస్త్రచికిత్సలకు రిఫర్ చేసినట్టు పేర్కొన్నారు. VELUGU

కేసీఆర్ సార్‌కు వందనాలు

ఆరునెలలుగా కండ్లు కొంతమబ్బులు కమ్మినట్లు కనిపిస్తున్నాయి. హమాల్‌వాడీలో పెట్టిన కంటివెలుగు శిబిరంలో పరీక్షలు ఉచితంగా చేశారు. కంటివెలుగు పెట్టి మాలాంటి వారిని ఆదుకొంటున్న కేసీఆర్ సార్‌కు వందనాలు. - కల్యాణి, హమాల్‌వాడీ, నిజామాబాద్

కంటి మసకలు పోయాయి

కండ్లు సరిగ్గా కనపడక ఇబ్బందులుపడుతున్న నాలాంటి నిరుపేదలకు కంటివెలుగు శిబిరాలు వరంలామారాయి. కంటివెలుగు శిబిరంలో ఆధార్ కార్డునంబర్ నమోదు చేసుకొని వెంటనే పరీక్షలు చేశారు. కంటి మసకలుపోయినయ్. - ఎన్ చందర్‌రావు, మధురబస్తీ, కొత్తగూడెం

× RELATED రామయ్య సన్నిధిలో ముక్కోటి అధ్యయనోత్సవాలు