కంటివెలుగు @ 30 లక్షలు

6,18,016 మందికి రీడింగ్ అద్దాల పంపిణీ 10 జిల్లాల్లో లక్షమందికి పైగా కంటిపరీక్షలు హైదరాబాద్ పరిధిలో 3 లక్షల మందికి పరీక్షలు తరువాతి స్థానాల్లో మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కంటివెలుగు శిబిరాలకు అనూహ్య స్పందన లభిస్తున్నది. కార్యక్రమం ప్రారంభించిన ఆగ స్టు 15 నుంచి మంగళవారం వరకు 22 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 30,40,474 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. 6,18,016 మందికి రీడింగ్ అద్దాలను అందజేశారు. మొత్తం 855 బృందాలతో వారానికి ఐదు రోజులపాటు శిబిరాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో వైద్యశిబిరాలను నిర్వహిస్తున్నారు. శిబిరాల నిర్వహణపై ఆయా గ్రామాలు, మున్సిపాలిటీల్లో ముందుగానే ప్రచారం నిర్వహించడంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున క్యూలు కన్పిస్తున్నాయి. మొత్తం తొమ్మిది జిల్లాలో వైద్య పరీక్షలు చేయించుకున్నవారి సంఖ్య లక్ష దాటింది. మరికొన్ని జిల్లాల్లో ఈ సంఖ్య లక్షకు చేరువగా ఉన్నది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3లక్షల మంది కి పైగా పరీక్షలు నిర్వహించగా.. తరువాతి స్థానంలో మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. మేడ్చల్‌లో 1,94,551 మంది, రంగారెడ్డి జిల్లాలో 1,91,098 మం ది కంటిపరీక్షలు చేయించుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో కంటి పరీక్షలు చేయించుకున్నవారి సంఖ్య లక్ష దాటింది. మంగళవారం 1,44,240 మందికి కంటిపరీక్షలు చేయగా, 20,490 మందికి రీడింగ్ అద్దాలను అందజేశారు. kantivelugu1

అబ్ అచ్చా దిక్హ్రాహై

దూరం సూపు కనపడక బాగా ఇబ్బందిపడ్డ. కంటివెలుగు శిబిరంలోఉచితంగా పరీక్షలు చేస్తున్నరని మా కొడుకుచెప్తే వచ్చి చూయించుకున్న. ఇక్కడ వచ్చి సూపెట్టుకుంటే పరీక్షలుచేసి అద్దాలు, చుక్కలు మందిచ్చిండ్రు. అద్దాలు పెట్టుకున్నంక ఇప్పుడు మంచి కనపడుతున్నది. తెలంగాణ సర్కారు మంచి పనిచేస్తున్నది. - హమీద్, విద్యానగర్, రాజన్న సిరిసిల్లజిల్లా. kantivelugu2

కంటి వెలుగు అభినందనీయం

రాష్ట్రప్రభుత్వం చేపట్టిన కంటివెలుగు పథకం అభినందనీయం. రాష్ట్రంలోని ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, కండ్లజోడ్లు అందజేయడం అభినందనీయం.గత పాలకులు ఎప్పుడూ ఈ విధంగా ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు. -మల్లెల నాగేశ్వరమ్మ, గణేషన్‌పాడు, పెనుబల్లి మండలం, ఖమ్మం జిల్లా
× RELATED 20% పెరుగనున్న ఇంజినీరింగ్ ఫీజులు