ధోని కూతురు డ్యాన్స్‌కి నెటిజన్స్ ఫిదా

సెల‌బ్రిటీల‌కి సంబంధించిన ఏ విష‌యాలైన అభిమానులకి ఆస‌క్తికరంగానే ఉంటాయి. భార‌త క్రికెట్ మాజీ కెప్టెన్ ధోని విష‌యానికి వ‌స్తే కొంత ప్ర‌త్యేక‌మ‌నే చెప్పొచ్చు. ఎప్పుడు కూల్‌గా ఉండే ఈ మిస్ట‌ర్ కూల్ బ‌య‌ట క‌నిపించ‌డం అరుదు. ముఖ్యంగా వేడుక‌ల‌లో సంద‌డి చేయ‌డం అనేది చాలా త‌క్కువ‌. ఇటీవ‌ల ఇంగ్లాండ్ టూర్‌ని పూర్తి చేసుకొని ఇండియాకి వ‌చ్చిన ధోని.. శుక్ర‌వారం కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్‌ పటేల్ కుమార్తె పూర్ణ పటేల్‌ వివాహంకి కుటంబంతో హాజ‌ర‌య్యారు. అంత‌క‌ముందు రాత్రి జ‌రిగిన మెహందీ ఫంక్ష‌న్‌ని కూడా ఈ దంప‌తులు హాజ‌రయ్యారు. సంప్ర‌దాయ దుస్తులలో త‌ళుక్కున మెరిసిన ధోని, సాక్షి జంటకి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. తాజాగా ధోని కూతురు జీవా డ్యాన్స్‌కి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ముద్దు ముద్దుగా జీవా వేసిన స్టెప్పులకి నెటిజ‌న్స్‌కి ఫిదా అయ్యారు. జీవాపై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. గ‌తంలో జీవాకి సంబంధించిన వీడియోలని ధోని ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేయ‌గా, అవి కొద్ది నిమిషాల‌లోనే వైర‌ల్‌గా మారిన సంగ‌తి తెలిసిందే.

Related Stories: