నికీషా పటేల్ రౌడీ పోలీస్

Nikesha-patel పవన్‌కల్యాణ్ నటించిన పులి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నికీషా పటేల్. ఆ సినిమా విజయాన్ని సాధించకపోవడంతో ఆశించిన స్థాయిలో అవకాశాల్ని సొంతం చేసుకోలేకపోయింది. కొంత విరామం తరువాత ఆమె ఓ మహిళా ప్రధాన చిత్రంతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సన్నద్ధమవుతున్నది. నికీషా పటేల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం రౌడీ పోలీస్. జానీ దర్శకుడు. ఆర్.ఎ.ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై వేణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.నిర్మాతలు మాట్లాడుతూ నికీషా పటేల్ నటిస్తున్న మహిళా ప్రధాన చిత్రమిది. విధి నిర్వహణలో ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? వాటిని ఎలా ఎదుర్కొన్నది? అనేది ఈ చిత్ర ప్రధాన కథాంశం. ఈ సినిమా కోసం ఎలాంటి డూప్ లేకుండా నికీషా పటేల్ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ైక్లెమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నది అన్నారు. భానుచందర్, ముకుల్ దేవ్, అమిద్, గబ్బర్‌సింగ్ బ్యాచ్ తదితరులు నటిస్తున్నారు.
× RELATED వెంకీ అట్లూరి దర్శకత్వంలో..?