జాకియా పిటిష‌న్.. 26న విచార‌ణ‌

న్యూఢిల్లీ: 2002 గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని నరేంద్ర మోదీకి సిట్ క్లీన్ చిట్ ఇవ్వ‌డాన్ని స‌వాల్ చేస్తూ జాకియా జ‌ఫ్రీ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై ఈనెల 26వ తేదీన విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు సుప్రీంకోర్టు పేర్కొన్న‌ది. మాజీ కాంగ్రెస్ ఎంపీ ఇషాన్ జాఫ్రి భార్య జాకియా జాఫ్రి వేసిన పిటిషన్‌ను సుప్రీం గ‌తంలోనే విచారణకు స్వీకరించింది. మొద‌ట ఈ నెల 19వ తేదీన దీనిపై విచారణ చేపట్టనున్న‌ట్లు పేర్కొన్న‌ది. ఇవాళ సుప్రీం మ‌ళ్లీ విచార‌ణ‌ను 26వ తేదీకి వాయిదావేసింది. గుల్‌బర్గ్ సొసైటీ హత్యాకాండలో మోదీకి ఇచ్చిన క్లీన్‌చిట్‌ను సవాలు చేస్తూ గతేడాదే జాకియా జాఫ్రీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా.. దానిని ధర్మాసనం నిరాకరించింది. 2002, ఫిబ్రవరి 28న గుల్‌బర్గ్ సొసైటీలో జరిగిన దాడిలో కాంగ్రెస్ ఎంపీ ఇషాన్ జాఫ్రి సహా మొత్తం 68 మంది మృత్యువాత పడ్డారు.

Related Stories: