ఈనెల 30న ప్రమాణస్వీకారం..: వైఎస్ జగన్

అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో గొప్ప విజయం అందించిన ప్రజలకు వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఫలితాల వెల్లడి అనంతరం తాడేపల్లిలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ ప్రసంగిస్తూ.. అద్భుత విజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు. ఈ విజయం దేవుడి దయ, ప్రజల దీవెనలతో సాధ్యమైంది. 175 అసెంబ్లీ సీట్లకు గాను 150 స్థానాలు గెలవడం చరిత్రత్మాక విజయం. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇది ఒక నూతన అధ్యాయం. ప్రజలు ఓటేశారు అంటే అది విశ్వసనీయతకు ఓటేశారు. ఈ విజయం నా మీద ఉన్న బాధ్యత, విశ్వాసం మరింత పెంచుతుంది. ఇంత గొప్ప తీర్పు ఇచ్చిన ప్రజలు నాపై బాధ్యత పెంచారు. 5 కోట్ల మందిలో ఒక్కరికి మాత్రమే దేవుడు అవకాశం ఇస్తారు. ఆ అవకాశం వచ్చింది.. సుపరిపాలన అంటే ఏంటో చేసి చూపిస్తా. 6 నెలల నుంచి ఏడాదిలోపే జగన్ మంచి సీఎం అని మీరంతా అనేలా చేస్తా. నా ప్రతి అడుగు మీరు ప్రశంసించేలా ఉంటుందని చెబుతున్నా. ఈనెల 30న విజయవాడలో ప్రమాణస్వీకారం చేస్తానని జగన్ పేర్కొన్నారు.