గూగుల్ హోం యూజ‌ర్ల‌కు యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం సేవ‌లు ఫ్రీ..!

సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ త‌న యూట్యూబ్ మ్యూజిక్ సేవ‌ల‌ను భార‌త్‌లో గ‌త నెల‌లో ప్రారంభించిన విష‌యం విదిత‌మే. కాగా ఈ సేవ‌ల‌ను ఉచితంగా పొందాలంటే యాడ్స్ చూడాల్సి ఉంటుంది. అదే ప్రీమియం వెర్ష‌న్ అయితే నెల‌కు రూ.99 చెల్లించాలి. కాగా యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియంలో బ్యాక్‌గ్రౌండ్ ప్లే, ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్స్‌, యాడ్ ఫ్రీ ఎక్స్‌పీరియెన్స్ వంటి ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. అయితే గూగుల్ హోం, గూగుల్ అసిస్టెంట్ ప‌వ‌ర్డ్ స్మార్ట్ స్పీక‌ర్ల‌ను వాడే యూజ‌ర్లు మాత్రం యూట్యూబ్ మ్యూజిక్‌ను ఉచితంగానే పొంద‌వ‌చ్చు. ఈ మేర‌కు గూగుల్ స‌ద‌రు యూజ‌ర్ల‌కు ఈ ఆఫ‌ర్‌ను ప్ర‌స్తుతం అందిస్తున్న‌ది. ఇక గూగుల్ హోం యూజ‌ర్లు త‌మ మూడ్‌కు అనుగుణంగా యూట్యూబ్ మ్యూజిక్‌లో పాట‌ల‌ను వినే సౌక‌ర్యం కూడా అందిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌లు ఇత‌ర ఫీచ‌ర్లు కూడా యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం యూజ‌ర్ల‌కు ల‌భిస్తున్నాయి.
More in తాజా వార్తలు :