ప్రేమ పెండ్లికి నిరాకరిస్తున్నారని..

మహబూబ్‌నగర్‌ : ప్రేమ పెండ్లికి నిరాకరిస్తున్నారని భాస్కర్ అనే యువకుడు తన ప్రియురాలి ఇంటి ముందు ఒంటికి నిప్పు అంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబ్ నగర లో జరిగింది. స్థానికులు మంటలు ఆర్పి అతన్ని చికిత్స నిమిత్తం జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు.

హైదరాబాద్‌లోని బోరబండ సంజయ్‌నగర్‌కు చెందిన భాస్కర్‌ బీ ఫార్మసీ చదివాడు. భాస్కర్ కాలేజీలో తన జూనియర్‌ అయిన మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. వివాహం చేసుకునేందుకు పెద్దలను ఒప్పించేందుకు ప్రయత్నించే క్రమంలో అమ్మాయి తరపువారు అంగీకరించకపోవడమే కాకుండా తనపై బెరిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు భాస్కర్ చెబుతున్నాడు. పోలీసులు గురువారం రాత్రి వరకు ఈ ఘటనపై కేసు నమోదు చేయకపోవడం గమనార్హం.

Related Stories: