రైలు ఢీకొని యువకుడు మృతి....

కాచిగూడ : పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ లాల్యానాయక్ తెలిపిన వివరాల ప్రకారం కర్మన్‌ఘాట్ ప్రాంతానికి చెందిన అక్భర్ కుమారుడు మహ్మద్ జఫర్(22)వృతిరిత్యా ఫలక్‌నామాలోని హోటల్‌ల్లో పనిచేసేవాడు. ఫలన్‌నామా-బుద్వేల్ రైల్వేస్టేషన్‌ల మద్య పట్టాలు దాటుతుండగా అదే సమయంలో గుంటూర్ నుంచి కాచిగూడకు వస్తున్న ప్యాసింజర్‌రైలు ఢీకొనడంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కాచిగూడ రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్ని స్వాధీనపర్చుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖాన మార్చురికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
× RELATED వేర్వేరు ప్రాంతాల్లో న‌లుగురు అదృశ్యం