వైరల్ ఫొటో.. చూస్తే అద్భుతం కనిపిస్తుంది..!

నిత్యం మనం సోషల్ మీడియాలో అనేక మంది షేర్ చేసే కొత్త వార్తలు, విశేషాలు, వీడియోలు, ఫొటోలను చూస్తుంటాం. వాట్లిలో కొన్ని మనకు వినోదాన్ని పంచుతాయి. కొన్ని షాక్‌కు గురి చేస్తాయి. మరికొన్ని ఆశ్చర్యాన్ని, విస్మయాన్ని కలిగిస్తాయి. అయితే పైన ఇచ్చిన ఫొటో కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఇంతకీ ఇందులో స్పెషాలిటీ ఏముందీ.. అంటారా..? అయితే ఈ ఫొటోను ఒకసారి చూసి వదిలేస్తే దాని ప్రత్యేకత ఏమీ తెలియదు. మరి ఎలా చూడాలంటే.. ఫొటోలోని బుద్ధుడి ముక్కుపై ఉన్న చుక్కను 30 సెకన్ల పాటు తదేకంగా చూడండి. ఆ తరువాత కళ్లు మూసుకోవాలి. రెండు, మూడు సెకన్లు ఆగాక కళ్లు తెరచి గోడమీద లేదంటే డోర్ మీద, నేలపైన చూడండి. దీంతో అంతకు ముందు మీరు చూసిన బుద్ధుడి ఆకారం మీకు కనిపిస్తుంది. కావాలంటే ఓ సారి ట్రై చేయండి. ప్రస్తుతం ఈ ఫొటో ఫేస్‌బుక్‌లో వైరల్ అవుతున్నది.
× RELATED యువకుడి దారుణహత్య.. ప్రేమవ్యవహారం బయటపెట్టడమే కారణమా?