ఈ నెల 22న విడుదల కానున్న షియోమీ రెడ్‌మీ నోట్ 6 ప్రొ స్మార్ట్‌ఫోన్

మొబైల్స్ తయారీదారు షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 6 ప్రొ ను ఈ నెల 22వ తేదీన విడుదల చేయనుంది. మరుసటి రోజు.. అంటే.. నవంబర్ 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనున్నారు. రూ.14,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది.

షియోమీ రెడ్‌మీ నోట్ 6 ప్రొ ఫీచర్లు...

6.26 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Related Stories: