షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ రెడ్ ఎడిషన్ విడుదల

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు షియోమీ తన రెడ్‌మీ నోట్ 5 ప్రొ స్మార్ట్‌ఫోన్‌కు గాను రెడ్ కలర్ వేరియెంట్‌ను తాజాగా విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఫోన్‌కు గాను బ్లాక్, బ్లూ, గోల్డ్, రోజ్ గోల్డ్ వేరియెంట్లు యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో కొత్తగా వచ్చిన రెడ్ కలర్ వేరియెంట్ ఈ వేరియెంట్ల సరసన చేరనుంది. రెడ్ కలర్ వేరియెంట్‌లో ముందు భాగంలో బ్లాక్ ఫినిషింగ్, వెనుక భాగంలో రెడ్ కలర్ ఫినిషింగ్‌ను ఇచ్చారు.

షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ రెడ్ కలర్ వేరియెంట్ 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లో లభిస్తున్నది. ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ ఫోన్‌ను యూజర్లు కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లోనూ త్వరలో ఈ వేరియెంట్ లభ్యం కానుంది. ఇక ఇందులో 5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు ఉన్నాయి.

Related Stories: