ఈ నెల 8న భారత్‌లో విడుదల కానున్న షియోమీ ఎంఐ ఎ2

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎంఐ ఎ2 ను స్పెయిన్‌లో ఇటీవలే విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్‌ను ఈ నెల 8వ తేదీన భారత్‌లో విడుదల చేయనున్నారు. అమెజాన్ సైట్‌లో ప్రత్యేకంగా ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు. రూ.20వేల ప్రారంభ ధరకు ఈ ఫోన్ లభ్యమయ్యే అవకాశం ఉంది.

షియోమీ ఎంఐ ఎ2 ఫీచర్లు...

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 32/64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, 3010 ఎంఏహెచ్ బ్యాటరీ.

× RELATED ఛత్తీస్‌గఢ్‌లో రేపు రెండో విడత పోలింగ్