55 కిలోమీట‌ర్ల బ్రిడ్జ్‌ను ప్రారంభించిన జిన్‌పింగ్‌

జుహాయ్‌: ప్రపంచంలోనే పొడవైన సముద్ర వంతెనను చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ ప్రారంభించారు. గువాంగ్‌డాంగ్ ప్రావిన్సులోని జుహాయి సిటీలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న బ్రిడ్జ్‌ను ప్రారంభించారు. హాంగ్ కాంగ్ నుంచి మ‌కావ్ వ‌ర‌కు వెళ్లే ఈ బ్రిడ్జ్ 55 కిలోమీట‌ర్ల పొడువు ఉంది. ఈ బ్రిడ్జ్ జుహాయ్ మీదుగా వెళ్తుంది. ఈ నెల 24 నుంచి ప్రజలు ఈ బ్రిడ్జ్‌పై ప్రయాణించవచ్చని గ‌తంలో అధికారులు ప్రకటించారు. 55 కి.మీ. పొడవున్న ఈ వంతెన నిర్మాణ పనులను 2009 డిసెంబర్‌లో ప్రారంభించారు. హాంకాంగ్, జుహాయ్ మధ్య ప్రయాణానికి మూడు గంటల సమయం పడుతుంది. ఈ వంతెన మీదుగా 30 నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకోవచ్చు. దీనిపై రోజూ సుమారు 29,100 వాహనాలు ప్రయాణించవచ్చు. 60 ఈఫిల్ టవర్ల నిర్మాణానికి ఉపయోగించే ఉక్కును దీని నిర్మాణానికి ఉపయోగించారు.

Related Stories: