పట్టా మార్పిడిలో జాప్యం

చందంపేట : నా పేరు నలావత్ జింత, మాది నల్లగొండ జిల్లా చందంపేట మండలం తెల్‌దేవర్‌పల్లి గ్రామం. నా భర్త నలావత్ తావుర్య పేరు మీద 886 ఖాతా నంబర్.. సర్వే నంబర్ 129/1/1 లో 3.32 ఎకరాల భూమి ఉన్నది. భూరికార్డుల ప్రక్షాళన సమయంలో దరఖాస్తు చేసుకున్నా మాకు కొత్త పాస్‌పుస్తకం రాలేదు. కొత్త పాస్‌పుస్తకం కోసం నా భర్త అనేకసార్లు తాసిల్ కార్యాలయం చుట్టూ ఎన్నోసార్లు తిరిగారు. అయినా పని కాలేదు. నా భర్త 8 నెలల కింద మృతి చెం దారు. దీంతో నా భర్త పేరు మీద ఉన్న భూమిని నా పేరి ట ఫౌతీ చేయాలని అధికారులను కోరాను. వీఆర్వో, తాసిల్ చుట్టూ తిరిగినా కనికరించడం లేదు. సారూ నా భర్త చనిపోయాడు. భూమిని నా పేరిట మార్చండని వీఆర్వోను అనేకసార్లు వేడుకొన్నా పట్టించుకోవట్లేదు. గ్రామంలో చాలామంది రైతులు ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు సాయం మూడుసార్లు తీసుకొన్నారు. కానీ నాకు ఒక్కసారి కూడా రాలేదు. మాది పేద కుటుంబం. నా బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక ధర్మగంటను ఆశ్రయించాను. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు కనికరించి నాకు న్యాయం చేయాలని చేతులెత్తి మొక్కుతున్నాను.

సమస్యను పరిష్కరిస్తాం

నలావత్ జింత భర్త తావుర్య మృతిచెందిన విషయం నా దృష్టికి రాలేదు. వీఆర్వో దృష్టికి వచ్చినప్పటికి నాకు చెప్పలేదు. తావుర్య పేరు మీద ఉన్న భూమిని ఫౌతీ ఆధారంగా జింత పేరు మీద మార్చే విధంగా వీఆర్వోతో ఫారం-6 ద్వారా ప్రొసీడింగ్ తయారు చేయించి త్వరలో మార్చేవిధంగా చర్యలు తీసుకుంటా. - రవీంద్రరాజు, తాసిల్దార్, చందంపేట

Related Stories:

More