జపాన్ ఒక మంచి స్నేహితుడిని కోల్పోయింది : ప్రధాని అబే

టోక్యో : భారతరత్న అటల్ బిహారి వాజపేయి మృతిపట్ల జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే సంతాపం తెలిపారు. వాజపేయి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రధాని అబే మాట్లాడుతూ.. జపాన్ ఒక మంచి స్నేహితుడిని కోల్పోయిందన్నారు. వాజపేయి మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. ప్రధాని హోదాలో వాజపేయి 2001లో జపాన్ వచ్చారని ఆ దేశ ప్రధాని గుర్తు చేశారు. ఇండియా - జపాన్ మధ్య స్నేహబంధాన్ని వాజపేయి బలోపేతం చేశారని షింజో అబే పేర్కొన్నారు.
× RELATED కాంగ్రెస్‌లా కాదు.. వందకు వందశాతం రుణమాఫీ : సీఎం