అధ్యక్షుడు ఆదేశిస్తే వారణాసి నుంచి పోటీ: ప్రియాంక గాంధీ

వయనాడ్ : ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ప్రియాంకా గాంధీ వాద్రా పార్టీ అభ్యర్థులను గెలిపించడమే ధ్యేయంగా ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల్లో పోటీ అంశంపై స్పందించారు ప్రియాంకా గాంధీ. ఇవాళ కేరళలో ప్రియాంకా గాంధీని వారణాసి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తారా? అని విలేకరులు ప్రశ్నించగా..పార్టీ అధ్యక్షుడు పోటీ చేయాలని నన్ను కోరితే..తప్పకుండా సంతోషంగా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. అంతకుముందు మక్కంకున్నులో పుల్వామా అమరజవాన్ వీవీ వసంత్ కుమార్ ను కుటుంబసభ్యులను ప్రియాంకా గాంధీ పరామర్శించారు.
More in జాతీయం :