అల్లు అర్జున్‌కు జోడీగా..?

సమంత తాజాగా మరో భారీ చిత్రానికి ఓకే చెప్పినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే... అల్లు అర్జున్ కథానాయకుడిగా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో గీతాఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఓ చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు. విభిన్ననమైన కథ, కథనాలతో సాగే ఈ చిత్రం కోసం సమంతను చిత్ర వర్గాలు సంప్రదించినట్లు తెలిసింది. కథ డిమాండ్ మేరకు ఆమె అయితేనే బాగుంటుందని దర్శకుడు సూచించడంతో సమంత నటించడానికి అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో చిత్ర బృందం వెల్లడించనుంది.