భర్తను హత్య చేసి ప్రమాదం జరిగిందని...

హైదరాబాద్: నగర శివారులోని గుర్రంగూడ వద్ద దారుణ సంఘటన చోటు చేసుకుంది. వ్యక్తి మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఉద్యోగి కేస్యానాయక్ మృతి కేసును పోలీసులు హత్య కేసుగా తేల్చారు. సంఘటన వివరాల్లోకి వెళితే ... రెండు రోజుల క్రితం తన భర్తను హత్య చేసిన భార్య కారు ప్రమాదంలో అతడు మృతి చెందినట్లు చిత్రీకరించేందుకు యత్నించింది. విద్యుత్ స్తంభానికి కారు ఢీకొని భర్త చనిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ జరిపిన పోలీసులు భార్యనే కేస్యానాయక్‌ను హత్య చేసినట్లు తేల్చారు. ఈ హత్య కేసులో మృతుడి భార్యతో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భర్త ఉద్యోగం, బీమా సొమ్ము కోసం ఈ ఘాతకానికి పాల్పడినట్లు నిందితురాలు పోలీసుల ఎదుట అంగీకరించింది. హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
× RELATED నామినేషన్ల చివరి రోజు కూటమి పార్టీలకు కాంగ్రెస్ షాక్