వాట్సాప్‌లో వచ్చిన మరో అదిరిపోయే ఫీచర్..!

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఇకపై యూజర్లు అందులో గ్రూప్ వీడియో కాలింగ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ గురించి వాట్సాప్ గతంలోనే హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈ ఫీచర్ యూజర్లకు లభిస్తున్నది.

వాట్సాప్ ప్రవేశపెట్టిన గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్ సహాయంతో ఒకేసారి నలుగురు గ్రూప్ వీడియో కాలింగ్ చేసుకోవచ్చు. అయితే ముందుగా ఇద్దరు యూజర్లు వన్ టు వన్ వీడియో చాటింగ్ మొదలు పెట్టాలి. అనంతరం ఇద్దరు యూజర్లను అందులోకి యాడ్ చేయాలి. దీంతో గ్రూప్ వీడియో కాలింగ్ సాధ్యపడుతుంది.

వాట్సాప్ గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులో ఉంది. ఈ యాప్‌కు చెందిన అప్‌డేటెడ్ వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్‌ను యూజర్లు పొందవచ్చు.

× RELATED 3వేల యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైళ్ల కొనుగోలు..