వదంతుల నిరోధానికి వాట్సాప్ చర్యలు

న్యూఢిల్లీ : వాట్సాప్ వేదికగా వైరల్ అవుతున్న వదంతులతో పలు రాష్ర్టాల్లో స్థానికులు అనుమానితులను కొట్టిచంపుతున్న నేపథ్యంలో ఆ సోషల్ మీడి యా సైట్ మేల్కొంది. పుకార్లను, గాలివార్తలను వినియోగదారులు గుర్తించే విధంగా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది.యూజర్లకు అవగాహన కలిగేలా దేశంలోని ప్రముఖ దినపత్రికల్లో పూర్తి పేజీ ప్రకటనను విడుదల చేసింది. మనకు వచ్చిన సమాచారం నిజమా? కాదా? అని నిర్ధారించుకోవడానికి పలు చిట్కాలను సూచించింది.

కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గతవారం దేశంలోని పలు రాష్ర్టాల్లో చోటుచేసుకుంటున్న హింస గురించి హెచ్చరిస్తూ వాట్సాప్ యాజమాన్యానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాట్సాప్ అందుకనుగుణంగా చర్యలు చేపట్టింది. భయాన్ని, కోపాన్ని కలుగజేసే మెసేజ్‌లను షేర్ చేసేముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలని వాట్సాప్ సూచించింది. భిన్నంగా కనిపించే, అక్షరదోషాలు ఉన్న మెసేజ్‌ల కచ్చితత్వాన్ని నిర్ధారించుకోవాలన్నది. దీంతోపాటు ఫార్వర్డ్ మెసేజ్‌లను గుర్తించేలా కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నట్టు తెలిపింది.

× RELATED ఇంజిన్ రహిత రైలు ట్రైయిల్ రన్ విజయవంతం