ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా

RAHANE అంటిగ్వా: వెస్టిండీస్ టూర్‌లో భాగంగా టీ20, వన్డే సిరీస్‌లు చేజిక్కించుకున్న టీమ్‌ఇండియా.. టెస్టు సిరీస్‌నూ సొంతం చేసుకునేందుకు గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నది. అసలు పోరుకు ముందు వెస్టిండీస్-ఏతో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ను భారత్ ఎలెవెన్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి చివరకు డ్రాగా ముగించింది. అజింక్యా రహానే (54), హనుమ విహారి (64) అర్ధశతకాలతో చెలరేగడంతో భారత్ ఎలెవెన్ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 188 పరుగుల వద్ద డిక్లేర్‌చేసింది. 305 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ చివరకు 21 ఓవర్లలో 47/3తో నిలిచింది. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరుజట్ల కెప్టెన్లు డ్రాకు మొగ్గుచూపారు. తొలి ఇన్నింగ్స్‌లో పుజారా సెంచరీ, రోహిత్ శర్మ అర్ధ సెంచరీ బాదడంతో భారత్ ఎలెవన్ 297/5 వద్ద డిక్లేర్ చేయగా.. అనంతరం ఇషాంత్, ఉమేశ్, కుల్దీప్ తలా 3 వికెట్లు పడగొట్టడంతో వెస్టిండీస్-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకు ఆలౌటైంది.