బొమ్మ తుపాకీ అనుకుని తల్లిని కాల్చింది..

కోల్‌కతా : ఓ చిన్నారి బొమ్మ తుపాకీ అనుకుని తన తల్లిని కాల్చిన ఘటన పశ్చిమబెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది. ఇంటి ఆవరణలో తల్లికి ఓ తుపాకీ దొరికింది. దీంతో ఆ తుపాకీని తన కుమార్తెకు ఇచ్చింది. అది బొమ్మ తుపాకీ అని భావించిన ఆ అమ్మాయి.. దాంతో ఇంటి ముందు కూర్చున్న తల్లిని సరదగా కాల్చింది. తుపాకీలో నిజంగానే బుల్లెట్లు ఉండటంతో.. ఆవిడకు తీవ్ర గాయాలయ్యాయి. బాధిత మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధిత మహిళ ఇంటి ఆవరణలోకి తుపాకీ ఎలా వచ్చిందన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Related Stories: