సినిమా థియేటర్లలో తనిఖీలు..పలు థియేటర్లపై కేసులు

హైదరాబాద్ : నగరవ్యాప్తంగా తూనికలు, కొలతల శాఖ అధికారులు సినిమా థియేటర్లలో తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఐమాక్స్ థియేటర్, ఉప్పల్ ఏషియన్ థియేటర్, కూకట్‌పల్లి పీవీఆర్ థియేటర్లలో తినుబండారాలను ఎమ్మార్పీ కంటే ఎక్కువగా అమ్ముతున్నారన్న సమాచారంతో దాడులు చేపట్టారు. ఆయా థియేటర్లలో ఎమ్మార్పీ లేకుండా తిను బండారాలను విక్రయిస్తున్న క్యాంటీన్లపై రెండు కేసులు నమోదు చేశారు.

కొంపల్లిలోని సినీ ప్లానెట్‌లో కాఫీ, పాప్‌కార్న్ షాప్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. అదే విధంగా కొత్తపేటలోని మహాలక్ష్మి, మిరాజ్ సినిమా థియేటర్లలో తనిఖీలు నిర్వహించారు. మహాలక్ష్మి థియేటర్ నిర్వాహకులపై మూడు కేసులు నమోదుచేశారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ అమ్మితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

× RELATED నాటు తుపాకీ స్వాధీనం: ఇంజినీరింగ్ విద్యార్ధి అరెస్టు