నకిలీలపై ఎలాంటి సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకుంటాం

హైదరాబాద్: చట్టాలను నూటికి నూరు శాతం అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పేకాట క్లబ్‌లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది కుటుంబాలను నాశనం చేసిన గుడుంబాను నిషేధించామన్నారు. నగరంలోని ఓ హోటల్‌లో ఫిక్కీ ఆధ్వర్యంలో నకిలీలు, స్మగ్లింగ్‌పై పోరాటం- ఆర్థిక అభివృద్ధి వేగవంతం చేయడం అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో ఈటల ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. సంస్కరణలకు తెలంగాణ గొప్ప కేంద్రం కాబోతుందని అన్నారు. నకిలీలపై ఎలాంటి సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకుంటాం.వినియోగదారులను చైతన్యపరచాల్సిన అవసరముందని తెలిపారు. ఇందుకోసం స్వచ్ఛంద సంస్థలు కూడా పనిచేయాలన్నారు.
× RELATED యోగా టీచర్ కావాలనుకునే వారికి సువర్ణావకాశం..