పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం: హరీశ్ రావు

సిద్దిపేట : టీఆర్ఎస్ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తిస్తుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి అండగా ఉండి కాపాడుకుంటామని ఆయన అన్నారు. ఇటీవల చిన్నకోడూరు మండలం చెర్ల అంకిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన దానాబోయిన లక్ష్మీ బైక్ మీదుగా వెళుతుండగా ట్రాక్టర్ ఢీకొని మృతి చెందింది. ఇవాళ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం..వారికి పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా మంజూరు చేయించిన రూ.2 లక్షల ప్రమాద బీమా చెక్కును హరీశ్ రావు అందజేశారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..పార్టీలో సభ్యత్వం పొంది ప్రమాదవశాత్తు చనిపోతే, పార్టీ పక్షాన ఇన్సూరెన్స్ చేసి రూ.2 లక్షల ప్రమాద బీమా పార్టీ పక్షాన ఇస్తుందన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో గతంలో 18 మంది కార్యకర్తల కుటుంబాలకు అందించామని, కొత్తగా ఇద్దరి కార్యకర్తలకు ప్రమాద బీమా మంజూరు అయిందని వెల్లడించారు.

× RELATED యువకుడి దారుణహత్య.. ప్రేమవ్యవహారం బయటపెట్టడమే కారణమా?