ఆ చెప్పులు మాకొద్దు బాబోయ్!

మధ్యప్రదేశ్: ఉచిత చెప్పుల పంపిణీ పథకం మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. చరణ్ పాదుకా యోజన పేరుతో ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకంలో తునికాకు సేకరణ కూలీలు, నిరుపేదలకు ఉచితంగా చెప్పులు, బూట్లు పంపిణీ చేయటం ప్రధాన లక్ష్యం. అయితే ఈ చెప్పుల తయారీలో (అడుగు భాగం) కార్సినోజెనిక్ అనే అజో డై రసాయనం వాడటం వల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు ఉంటుందని సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ తన నివేదికలో పేర్కొని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. దాంతో ఉచిత పాదరక్షల్ని ధరించేందుకు, ప్రభుత్వం నుంచి తీసుకునేందుకు పేదలు జంకుతున్నారు.
× RELATED వేర్వేరు ప్రాంతాల్లో న‌లుగురు అదృశ్యం