ప్రజా తీర్పు శిరోధార్యం..మాకు మెజార్టీ స్థానాలు ఇచ్చారు

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలు మాకు మెజార్టీ స్థానాలు కట్టబెట్టారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజాతీర్పు శిరోధార్యం..మాకు 9 స్థానాలు ఇచ్చారు. ప్రజాశ్రేయస్సు కోసం అంకితమై నిబద్దులుగా పనిచేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ..రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న నరేంద్రమోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు. గెలిచిన ప్రతీ అభ్యర్థికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. టీఆర్‌ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన ప్రతీ కార్యకర్తకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో మెరుగైన ఫలితాల కోసం కష్టపడ్డాం. కేంద్రంలో హక్కులు సాధించుకునే బాధ్యత మాపై ఉందని కేటీఆర్ అన్నారు. ఏపీలో మెజార్టీ స్థానాల్లో విజయకేతనం ఎగరేసి..సీఎం కాబోతున్న వైఎస్ జగన్‌కు పార్టీ అధ్యక్షులు కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేసినట్లు కేటీఆర్ తెలిపారు.
More in తాజా వార్తలు :