జాతీయ మహిళా కమిషన్‌కు కొత్త సభ్యులు

న్యూఢిల్లీ: జాతీయ మహిళా కమిషన్‌కు నూతనంగా ముగ్గురు సభ్యులు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ ఉత్తర్వులు వెలువరించింది. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్,1990ను అనుసరించి ముగ్గురు సభ్యులను జాతీయ మహిళా కమిషన్ సభ్యులుగా నామినేట్ చేసింది. చంద్రముఖి దేవి, సిసో షైజా, కమలేశ్ గౌతమ్ సభ్యులుగా నియమితులయ్యారు. వీరు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడు సంవత్సరాలు లేదా వయస్సు రీత్యా 65 ఏండ్ల వరకు పదవిలో కొనసాగనున్నారు.

Related Stories: