నగరంలో వ్యర్థాలను తొలగించాలి : జీహెచ్‌ఎంసీ కమిషనర్

హైదరాబాద్ : నగరంలో ఈ నెల 10వ తేదీ లోపు వ్యర్థాలను తొలగించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిశోర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నగరంలో రహదారులు, గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర ప్రాంతాల్లో వ్యర్థాల తొలగింపు పనులను ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఆరు రోజుల్లో నగర వ్యాప్తంగా 7,164 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను జీహెచ్‌ఎంసీ యంత్రాంగం తొలగించిందని తెలిపారు. భవన నిర్మాణ, మున్సిపల్, ఇతర వ్యర్థాలను అధికారులు తొలగించారు. రోడ్లపై గుంతలు పూడ్చివేత కార్యక్రమం, రోడ్ల మరమ్మతుల పనులు చేపట్టాలని దాన కిశోర్ ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
× RELATED వేర్వేరు ప్రాంతాల్లో న‌లుగురు అదృశ్యం