ఓపెన‌ర్ల మెరుపులు..వార్నర్‌, బెయిర్‌స్టో అర్థశతకాలు

హైదరాబాద్‌: ఉప్పల్‌ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్లు ధనాధన్‌ బ్యాటింగ్‌తో అలరిస్తున్నారు. మైదానం నలువైపులా బౌండరీలతో చెలరేగుతూ లక్ష్యం వైపు దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌, బెయిర్‌స్టోలు అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. ఇద్దరు కూడా నరైన్‌ బౌలింగ్‌లో హాఫ్‌సెంచరీలు నమోదు చేసుకోవడం విశేషం. ఛేదనలో ఎక్కడ కూడా తడబడకుండా సూపర్‌ బ్యాటింగ్‌తో పరుగులు సాధిస్తున్నారు. కోల్‌కతా నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని కొన్ని బంతులు మిగిలుండగానే ఛేదించేలా వీరిద్దరి బ్యాటింగ్‌ సాగుతోంది. సన్‌రైజర్స్‌కు మంచి శుభారంభం అందించిన జోడీ 100కు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. 12 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్‌ వికెట్‌ నష్టపోకుండా 130 పరుగులు చేసింది. వార్నర్‌(67), బెయిర్‌స్టో(58) క్రీజులో ఉన్నారు.
More in క్రీడలు :