16న కేయూ డిగ్రీ ఇన్‌స్టంట్ పరీక్ష

రెడ్డికాలనీ, సెప్టెంబర్ 14: కేయూ డిగ్రీ ఆరో సెమిస్టర్‌లో ఒక సబ్జెక్టు ఫెయిలైన విద్యార్థులకు ఈనెల 16న ఇన్‌స్టంట్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ మహేందర్‌రెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు డాక్టర్ సదానందం, వెంకయ్య శనివారం తెలిపారు. పరీక్షకు 1233 మంది విద్యార్థులు హాజరవుతున్నారని, పరీక్ష 16న మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరుగుతుందని వివరించారు. వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్‌లో రెండు చొప్పున పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వరంగల్‌లో ఎల్‌బీ కళాశాల, హన్మకొండలో వాగ్దేవి, ఖమ్మంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాల్వంచ, ఆదిలాబాద్‌లో ప్రభుత్వ కళాశాల, నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మంచిర్యాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హాల్‌టికెట్లను కేయూ వెబ్‌సైట్లలో ఉంచినట్లు వారు పేర్కొన్నారు.

Related Stories:

More