రేపు జూపార్క్‌లో అవగాహన సదస్సు

అర్బన్ కలెక్టరేట్, సెప్టెంబర్ 13: ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జనవిజ్ఞాన వేదిక పర్యావరణ విభాగం, తెలంగాణ ప్రభుత్వ అటవీశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఓజోన్ పొరను పరిరక్షించుకుందాం అనే అంశంపై విద్యార్థులకు ఆదివారం అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు జనవిజ్ఞాన వేదిక సెక్రటరీ ధర్మప్రకాశ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు హంటర్‌రోడ్డులోని కాకతీయ జూపార్క్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో సదస్సుతో పాటు విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు ఎవరి రంగులు వారే తెచ్చుకోవాలన్నారు. సదస్సుకు ముఖ్య అతిథులుగా వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల అటవీశాఖ అధికారులు రామలింగం, పురుషోత్తం పాల్గొంటారన్నారు.

Related Stories:

More