డిజిటలైజేషన్‌కు ఎంతో ప్రాముఖ్యత

భీమారం,సెప్టెంబర్13: ప్రపంచ వ్యాప్తంగా డిజిటలైజేషన్ ప్రాముఖ్యత పెరుగుతోందని సీఎస్‌ఆర్ ఎలక్ట్రోనాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్ శివారెడ్డి అన్నారు. భీమారం కిట్స్ కాలేజీలో సీఈసీ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం పీసీబీ డిజైన్ అండ్ ప్యాబ్రికేషన్ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల స్థానంలో డిజిటలైజేషన్ వినియోగం పెరుగుతోందన్నారు. జీవసాంకేతిక ప్రాజెక్టు నైపుణ్యాలను విద్యార్థులు నేర్చుకోవాలని సూచించారు. సీఈసీ విభాగాధిపతి ప్రొఫెసర్ రఘోత్తంరెడ్డి మాట్లాడుతూ డిజిటలైజేషన్‌లో విద్యార్థులకు రెండు రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వర్క్‌షాపులో ప్రాగ్రాం కన్వీనర్ డాక్టర్ రాజు, వేణు, పవన్, సౌజన్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Stories:

More