కెనరాబ్యాంక్‌లో చిల్లరనాణేల పంపిణీ

సిద్ధార్థనగర్, సెప్టెంబర్13: వరంగల్ కెనరాబ్యాంక్ రీజియన్ ఆఫీస్ పరిధిలోని 68శాఖల్లో శుక్రవారం చిల్లర నాణేల పంపిణీ నిర్వహించారు. మార్కెట్‌లో చిల్లర కొరత పరిస్థ్ధితులను దృష్టిలో పెట్టుకుని కాయిన్ మేళా నిర్వహించినట్లు కెనరా బ్యాంక్ ఏజీఎం అలెగ్జాండర్ తెలిపారు. ఈ మేళాలో మొత్తం రూ.20లక్షల విలువైన రూ.1, రూ.2, రూ.5 విలువ చేసే నాణేలను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. మేళలో పాల్గొన్న చిరువ్యాపారులు, ఖాతాదారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అన్ని శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Related Stories:

More