కొనసాగుతున్న ప్రత్యేక కార్యాచరణ పనులు

భీమదేవరపల్లి: గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సంకల్పించిన 30రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాలు మండలంలోని అన్ని గ్రామాల్లో చురుకుగా కొనసాగుతున్నాయి. మల్లారం గ్రామంలో పారిశుధ్య నిర్వహణపై గ్రామస్తులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రత్యేకాధికారి సంతోష్, ఎంపీడీఓ భాస్కర్, సర్పంచ్ గూడెల్లి రాజిరెడ్డి, ఉపసర్పంచ్ పాతపెల్లి యాదగిరి, పంచాయతీ కార్యదర్శి వేణుమాధవ్, ఏఎన్‌ఎం మంగ, అంగన్‌వాడీ టీచర్లు శోభ, సుగుణ, వీవోఏలు శోభారాణి, అనిత, సంధ్య, కారోబార్ కుమార్, మహిళా సంఘాల సభ్యులు వీధుల్లో గడ్డిని తొలగించారు. తడి, పొడిచెత్తను సేకరించి దగ్ధం చేశారు. అనంతరం గ్రామంలో డంపింగ్‌యార్డుకోసం స్థలాన్ని పరిశీలించారు. ధర్మారంలో విద్యుత్ సమస్యలను అధికారులు తొలగించారు. ముమ్మరంగా పారిశుధ్య పనులు ఎల్కతుర్తి : 30రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో గురువారం పారిశుధ్య పనులు ముమ్మరంగా కొనసాగాయి. ఆయా గ్రామాల సర్పంచ్‌లు మురికి కాలువలు శుభ్రం చేయడంతో పాటు రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్ల పొదలు తొలగించారు. అలాగే రోడ్లను శుభ్రం చేయడమే కాకుండా గుంతల్లో మొరం పోయించి చదును చేశారు. ఎంపీడీవో సునీత, ఈవోపీఆర్డీ జయంత్‌రెడ్డి ఆయా గ్రామాల్లో జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు, ప్రత్యేకాధికారులు, కార్యదర్శులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తమవంతు బాధ్యతగా పనిచేయాలి కమలాపూర్: గ్రామాల్లోని ప్రజలు తమవంతు బాధ్యతగా పని చేయాలని మండల పంచాయతీ అధికారి రవిబాబు అన్నారు. మండలంలోని కొత్తపల్లి, కన్నూరు గ్రామాల్లో 30రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక కార్యా చరణలో భాగంగా గురువారం శ్రమదానం చేశారు. గ్రామా ల్లో ఉన్న పిచ్చి మొక్కలను గ్రామస్తులతో కలసి తొలగిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఇంటి పరిసరాలను ప్రతీ రోజు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతతో దోమలు వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చన్నారు. దోమల నివారణతో మలేరియా వంటి విష జ్వరాలు రాకుండా అరికట్టవచ్చన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధికి కలిసి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మహిళా సంఘాల సభ్యులు, యువకులు పాల్గొన్నారు.

Related Stories:

More