పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం

ఐనవోలు, సెప్టెంబర్ 11 : పరిసరాలను పరిశుభ్రంగా ఉంటే అందరూ ఆరోగ్యం ఉండవచ్చని స్థానిక ఎంపీపీ మార్నేని మధుమతి అన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల పరిసరాల్లో ఉపాధ్యాయులతో కలిసి బుధవారం పాల్గొని పిచ్చి మొక్కలను, గడ్డిని తొలగించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత ఏవిధంగా పాటిస్తున్నారో పరిసరాల పరిశుభ్రత కూడ అదే విధంగా పాటించాలని సూచించారు. అనంతరం పాఠశాలలో నిర్వహిస్తున్న ఐదు అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రికార్డులను, టీచర్ల, చిన్నారుల హాజరుపట్టికలను పరిశీలించారు. సమయపాలన పాటించి, రికార్డుల నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని టీచర్లను మందలించారు. అదే విధంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో నూతనంగా వచ్చిన ఇద్దరు లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటరమణ, ప్రత్యేక అధికారి మాధవిలత, సర్పంచ్ జన్ను కుమారస్వామి, ఉప సర్పంచ్ సతీశ్‌కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related Stories:

More