బలహీనవర్గాల కోసమే సంక్షేమ పథకాలు

న్యూశాయంపేట, జూన్12: బడుగు బలహీన వర్గాల కళ్లల్లో ఆనందం నింపేందుకే తెలంగాణ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. బుధవారం హంటర్‌రోడ్డులోని క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం సహాయ నిధి చెక్కులను ఐనవోలు మండలంలోని వివిధ గ్రామాల లబ్ధిదారులకు అందజేశారు. 33 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద రూ.31, 50,000 చెక్కులు, 40మందికి సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.21, 40,000 విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బడుగుబలహీన వర్గాల ప్రజలు సంతోషంగా జీవించేందుకు సీఎం కేసీఆర్ పని చేస్తున్నారన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో పేదల్లో పెదవులపై నవ్వు చేరిందని చెప్పారు. పేద ప్రజలు ఆడపిల్ల పెళ్లికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో..నాటి ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ప్రత్యక్షంగా చూశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన వెంట నే ఆయన ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 57 ఏళ్లు నిండిన వృద్ధులు, ఒంటరి మహిళలకు, బోధకాలు, హెచ్‌ఐవీ బాధితులకు వచ్చే నెల నుంచి స్థానిక ప్రజాప్రతినిధుల చేతులమీదుగా రూ. 2016 పింఛన్ అందజేయనున్నట్లు పేర్కొన్నారు. రైతు బంధు ద్వారా రూ.4వేల నుంచి రూ.5 వేలకు పెంచి ఇప్పటికే రైతుల అకౌంట్లలో డబ్బు లు జమ చేశామన్నారు. ఎమ్మెల్యే, పార్లమెంట్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలందరి అభిమానంతో తనపై మరింత బాధ్య త పెరిగిందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల శ్రీరాములు, ఎంపీపీ మార్నేని రవీందర్‌రావు, సీనియర్ నాయకులు ఇండ్ల నాగేశ్వర్‌రావు, 57వ డివిజన్ అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Related Stories: