వినియోగదారులకు మెరుగైన సేవలు

కాజీపేట, జూన్ 12: ఇందన విక్రయ రంగం లో నిరంతరం వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించడంలో హిందుస్తాన్ పెట్రోల్ (హెచ్‌పీ) బంకులు ఆదర్శంగా నిలుస్తాయని హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ (హెచ్‌పీసీఎల్) ప్రాంతీయ డిఫ్యూటీ జనరల్ మేనేజర్ ఏవీఎన్‌ఎస్‌కే లక్ష్మణరావు అన్నా రు. దేశవ్యాప్తంగా జూన్ 10 నుంచి నెల రోజులపాటు చేపట్టిన హెచ్‌పీ ఎ క్కడ ఉంటే నమ్మకం అక్కడ ఉంది ప్రచార కార్యక్రమంలో భాగంగా కాజీపేట డీజిల్‌కాలనీలోని హెచ్‌పీ బంకులో బు ధవారం వినియోగదారులకు, డీలర్లకు, ప్రజల కు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లక్ష్యణరావు మాట్లాడుతూ జిల్లాలోని హెచ్‌పీ పెట్రోల్ బం కులు నాణ్యత, కొలత, తదితర నిబంధనలకు ఆ దర్శంగా నిలుస్తున్నాయన్నారు. వినియోగదారుడికి మరింత నమ్మకం పెంచడానికి ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. సంస్థ ఏర్పాటు చేసిన ప్రత్యేక అవగాహ న సదస్సులో వినియోగదారులు సలహాలు, సూచనలు అందచేస్తే పరిగణలోనికి తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో వినియోగదారులు ప్రేమేందర్‌రెడ్డి, కనుకయ్య, జైపాల్‌రెడ్డి, రాజేందర్, మేనేజర్ శ్రీకాంత్, వినియోగదారులు, సిబ్బంది తది తరులు పాల్గొన్నారు.

Related Stories: