పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి

-పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి -తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష పరకాల, నమస్తే తెలంగాణ : పరకాల నియోజకవర్గ ప్రజల పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అధికా రులను ఆదేశించారు. హన్మకొండలోని ఎమ్మెల్యే నివాసంలో పరకాల, నడికూడ, దామెర, ఆత్మకూరు, గీసుకొండ, సంగెం, ఖిలావరంగల్ మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలతో బుధవారం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి కార్యాలయాల చుట్టూ తిరిగిన ప్రజల పెండింగ్ సమస్యలను అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. మండల కార్యాలయాలకు ఎక్కువగా సదరం సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు వచ్చాయని, అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయాలకు భూ సంబంధ సమస్యలు పరిష్కరించాలని వినతులు వచ్చాయని చెప్పారు. పెన్షన్లు, కార్పొరేషన్ లోన్ల కోసం కూడా అధికారుల వద్ద వినతులు ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. ప్రతీ సమస్యలకు పరిష్కారం ఉంటుందని అర్థమయ్యేలా ప్రజలకు వివరించాలని చెప్పారు. అధికారులు జవాబుదారీతనంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతీ సంక్షేమ పథకాన్ని సరైన సమయంలో లబ్ధిదారులకు అందేలా అధికారులు కృషిచేయాలని పేర్కొన్నారు. గ్రామాల్లో పంచాయతీ సిబ్బంది శానిటేషన్, నీటి సరఫరా తదితర అంశాలపై ఎప్పటికప్పుడూ సమీక్షిస్తూ ప్రతీ గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. సర్పంచ్, ప్రజలు ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని అన్నారు. సమావేశంలో ఆర్డీవోలు కిషన్, మహేందర్‌జీ, జెడ్పీటీసీలు సిలువేరు మొగిలి, పాడి కల్పనాదేవి, కోడెపాక సుమలత, గరిగె కల్ప న, లేతాకుల సంజీవరెడ్డి, రాధిక, పోలీస్ ధర్మారావు, ఎంపీపీలు మచ్చ అనసూర్య రవీందర్, శంకర్, గోపు మల్లికార్జున్, సుమలత, వీరగోని కవితి రాజ్‌కుమార్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, నాయబ్ తహసీల్దార్లు, ఈవోఆర్డీలు పాల్గొన్నారు. మిషన్ పనులను పూర్తిచేయాలి.. నియోజకవర్గంలో జరుగుతున్న మిషన్ కాకతీ య నాలుగో విడత పనులను కాంట్రాక్టర్లు వెంట నే పూర్తిచేసేలా అధికారులు కృషిచేయాలని ఎమ్మె ల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హన్మకొండలోని ఆయన నివాసంలో బుధవారం ఇరిగేషన్ అధికారులతో నియోజకవర్గస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాలుగో విడత నిధులు మంజూరై పనులు పూర్తిచేయని వాటిని వెంటనే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పనులు ప్రారంభమై రోజులు గడుస్తున్నా పూర్తిచేయని గుత్తేదారులను వెంటనే తొలగించి కొత్తవారితో పనులు చేయించాలన్నారు. సమావేశంలో ఈఈ శ్రావణ్‌కుమార్, డీఈ వెంకట్రాంప్రసాద్, ఏఈలు రవీందర్‌రెడ్డి, వెన్సెంట్, రంజిత్ పాల్గొన్నారు.

Related Stories:

More