హరితహారాన్ని విజయవంతం చేయాలి

-నర్సంపేట ఏపీడీ పారిజాతం చెన్నారావుపేట : హరితహారం విజయవంతం కావడానికి ప్రతీ ఒక్కరు సన్నద్ధం కావాలని నర్సంపేట ఏపీడీ పారిజాతం అన్నారు. బుధవారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో కార్యదర్శులు, ఉపాధి సిబ్బందితో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. వర్షాలు పడగానే గ్రామాల్లోని ప్రజలకు, రైతులకు వన నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను పంపిణీ చేయాలన్నారు.అలాగే గ్రామాలలో రోడ్లకిరువైపుల, పాఠశాల, పంచాయతీ కార్యాలయాల ఆవరణ, ఖాళీ ప్రదేశాలలో హరితహారం మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. అంతేకాకుండా రైతులు తమ పంట భూముల్లో టేకు మొక్కలు, పండ్ల మొక్కలు నాటే విధంగా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు . అలాగే గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న మరుగుదొడ్లను త్వరితగతిన పూర్తి చేయించాలని సూచించారు.ఈ సమావేశంలో ఎంపీడీవో చందర్, ఏపీవో అరుణ, స్వచ్ఛభారత్ మిషన్ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, ఈసీ కిశోర్, క్లస్టర్ టీఏ సుధాకర్, కార్యదర్శులు షాహెద్‌పాషా, అశోక్, నర్సయ్య, సత్యనారాయణ, రాజమౌళి, బాలకిషన్, పద్మనాభస్వామి, ఫీల్డ్‌అసిస్టెంట్లు మోహన్, సురేశ్, రవికుమార్, ఫజల్, రాజు, కవిత పాల్గొన్నారు.

Related Stories: