భాగస్వాములు కావాలి డీఆర్‌డీఏ ఏపీడీ సీ రమేశ్

రాయపర్తి : హరితహారంలో మండలంలోని అన్ని గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని డీఆర్‌డీఏ ఏపీడీ సీ రమేశ్ కోరారు. బుధవారం హరితహారంపై మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఇన్‌చార్జి ఎంపీడీవో మామిడాల రాజన్న ఆధ్వర్యంలో సర్పంచ్‌లు, కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీడీ రమేశ్ మాట్లాడుతూ.. జిల్లా ఉన్నతాధికారులు మండలానికి హరితహారంలో బాగంగా నిర్ధేశించిన మొక్కలు నాటే లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని కోరారు. మొక్కలను నాటడంతోపాటు వాటిని సంరక్షించే బాద్యతలను సైతం ఉద్యోగులే చూడాల్సిందిగా సూచించారు. హరితహారం కార్యక్రమ నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించే వారిపై శాఖపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో ఈవోపీఆర్‌డీ రాజ్యలక్ష్మి, తహసీల్దార్ ఎల్ రవిచంద్రారెడ్డి, ఎంఈవో నోముల రంగయ్య, ఏపీవో దొనికెల కుమార్‌గౌడ్, సర్పంచ్‌లు నర్సయ్య, తారాశ్రీ రాజబాబు, సుమతియాదవరెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, దీప్లానాయక్, స్వామి, దయాకర్‌రావు, వనజాలక్ష్మినారాయణ, హరినాథ్, పద్మ, యాకమ్మ, కుమారస్వామి, సమ్మక్క భాస్కర్‌నాయక్, లావుడ్య భిక్షపతి, దేవేందర్‌రావు, సుజాత నర్సింహ్మానాయక్, హేమలత రవీందర్‌రెడ్డి, సుందర్‌నాయక్, గుగులోతు బీకోజీనాయక్, భాస్కర్, గజవెళ్లి అనంత ప్రసాద్, కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Stories: