వెల్లంపల్లి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలి

-జిల్లా సెక్టోరియల్ అధికారి సంధ్యారాణి పరకాల, నమస్తే తెలంగాణ : పరకాల మండలంలోని వెల్లంపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని జిల్లా సెక్టోరియల్ అధికారి ఎం సంధ్యారాణి అన్నారు. బుధవారం పాఠశాలలకు చేరుకుని ఆమె ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సర్పంచ్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతేడాది పాఠశాలలో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నందున ఈ ఏడాది ఇంటింటికి తిరిగి విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ చేయించాలన్నారు. గ్రామ సర్పంచ్, గ్రామస్తులు చొరవ తీసుకుని ప్రభుత్వ పాఠశాలకు తమ పిల్లలను పంపించాలని కోరారు. గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల ఉండగా ప్రైవేటు పాఠశాలలకు పంపించి విద్యార్థుల తల్లిదండ్రులు నష్టపోతున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మంచి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని పాఠశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో రమాదేవి, సర్పంచ్ కృష్ణ, పాఠశాల హెచ్‌ఎం నాగేంద్రస్వామి, ఉపాధ్యాయులు, సీఆర్‌పీ రమేశ్‌బాబు పాల్గొన్నారు.

Related Stories: