మొక్కల పంపిణీకి సన్నద్ధ్దం కావాలి

గీసుగొండ, జూన్ 12 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం మొక్కల పంపిణీకి అధికారులు సిద్ధ్దం కావాలని ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్ సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం హరితహారంపై అన్ని శాఖల గ్రామస్థాయి అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడారు. గీసుగొండ మండలంలో ఉన్న నర్సరీల్లో 12 లక్షల అరవై వేల మొక్కలను పెంచుతున్నట్లు అయన తెలిపారు. ఈజీఎస్, అటవీశాఖ ఆధ్వర్యంలో నర్సరీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండలంలోని రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ, విద్యుత్, వైద్య సిబ్బందితోపాటు మిగతా శాఖల వారు మొక్కలునాటే సంఖ్యను ఇవ్వాలని ఆయన కోరారు. వంద మొక్కల కంటే అధికంగా నాటే వారికి జాబ్ కార్డులు తప్పని సరిగా ఉండాలన్నారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్ సుహాసిని, ఈవోపీఆర్డీ శేషాంజన్‌స్వామి, ఎస్సై అబ్ధ్దుల్ రహీం, ఆర్‌ఐ అర్జున్, వివిధ శాఖల అధికారులు రమేశ్, వెంకన్న, హరిప్రసాద్, ఏపీవో మోహన్‌రావు, ఎపీఎం సురేశ్ తదితరులు పాల్గొన్నారు.

Related Stories: