కొనసాగుతున్న విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం

దుగ్గొండి, జూన్12 : మండలంలోని తిమ్మంపేటలో శ్రీలక్ష్మీనర్సింహాస్వామి ఆలయంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు మంగళవారం జరిగిన కార్యక్రమంలో గ్రామానికి చెందిన ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు, వందలాది మంది భక్తులు తరలివచ్చి ఉత్సవ విగ్రహాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో నిర్వహించిన పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతీ ఇంటికి ఒక గుమ్మడి కాయతో ఆలయానికి భక్తులు రాగా ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. ఆలయ అర్చకులు, వేదపండితులు విగ్రహాలకు విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ మోడెం విద్యాసాగర్, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు, ప్రతిష్ఠాపన ఉత్సవ నిర్వాహకులు పాల్గొన్నారు.

Related Stories: