నకిలీపై నిఘా

వనపర్తి రూరల్ : గత ఏడాది నాసిరకం విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు పలు ప్రాంతాలలో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే, పలు మండలాల్లో నిల్వ చేసి గుట్టుచప్పుడు కాకుండా ఎరువుల దుకాణాల్లో విక్రయించారు. పలు ప్రాంతాల్లోని గ్రామాలలో రహస్య ప్రాంతాలలో నిల్వ ఉంచి అమాయక రైతులకు అంటగట్టారు. పంట ఏపుగా పెరిగిన సరైన పూతరాక దిగుబడి తగ్గింది. పక్కా బిల్లులు ఇవ్వకపోవడంతో రైతు లు దిక్కుతోచని పరిస్థితుల్లో ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక బాధను దిగమింగారు. గతంలో నాసిరకం విత్తనా లు, ఎరువులు, పురుగుల మందుల విక్రయాలను అరికట్టేందుకు పోలీసు, వ్యవసాయశాఖ అధికారులు దృష్టి సారించి దాడులు నిర్వహించి నాసిరకం విత్తనాలు పట్టుకొని కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏ డాది జూన్ మాసంలో వానాకాలం సీజన్ ప్రారంభం కా నున్న నేపథ్యంలో రైతులు తమ పొలాలను సన్నద్దం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఏడాది కూడా నాసిరకం విత్తనాలు అమాయక రైతులకు అంటగట్టేందుకు పలువురు వ్యాపారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులె కొనుగోలు, చేసేటప్పుడు జాగ్రత్తలు, సూచనలు తప్పకు పాటించాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. సమన్వయంతో అధికారుల తనిఖీలు.. జిల్లాలోని నకిలీ విత్తనాలు, ఎరువుల మందుల పట్ల ముందస్తుగా పోలీసు అధికారులు, వ్యవసాయశాఖ అధికారులు గ్రామ, పట్టణాలలోని రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ విస్తరణ అధికారులకు సూచిస్తున్నారు. నకిలీ విత్తనాల గుర్చి ఏ విధంగా గుర్తు పట్టాలని, తక్కువ ధరకు ఎవరైన విక్రయిస్తే తమకు తెలియజేయాలని పోలీసు అధికారులు సూచించారు. రెండు శాఖల సమన్వయంతో జిల్లాలోని ఫర్టిలైజర్స్ దుకాణాలలో తనిఖీలు చేపట్టానున్నారు. ఎవరైన ఇటువంటి చర్యలకు పాల్పడితే పీడీ యాక్ట్ చట్టం ప్రయోగిస్తామని పోలీసు శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే గ్రామా ల్లో పోలీస్ కళాబృందంచే నకిలీ విత్తనాలపై అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించారు. గ్రామాల్లోకి నకిలీ విత్తనాల అమ్మకాలు చేసేవారిపై ఇప్పటికే సమాచారం సేకరించి వారిపై గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. అలాగే పోలీసు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్, స్పెషల్‌బ్రాంచ్ పోలీసులు వీరిపై ప్రత్యేక దృష్టిసారించారు. రానున్న 30 రోజుల వర్షాకాలంలోపు జిల్లాలో ఎక్కడ ఎటువంటి నకిలీ విత్తనాల, ఎరువుల సరఫరా కాకుండా జిల్లాను నకిలీ విత్తన రహిత వనపర్తి జిల్లాగా గుర్తింపు తీసుకొని రావడానికి పోలీసు శాఖ, వ్యవసాయశాఖ సమన్వయంగా ముందుకు పోతుంది. జాగ్రత్తలు పాటించండి.. -వ్యవసాయశాఖ ద్వారా లైసెన్స్ పొందిన డీలర్ల నుంచి విత్తనాలు కొనుగోలు చేయాలి -బిల్లులో విత్తనాల రకం నంబరు, గడువు తేదీ, కొనుగోలు తేదీ, డీలర్ సంతకం, రైతు సంతకం ఉండేలా చూసుకోవాలి. -లూజుగా ఉన్న సంచులు, పగిలిన ప్యాకెట్, సంచి, డబ్బాలపై సీలు ఉందా లేదా నిర్ధారించుకొవాలి. -గడువు దాటిన విత్తనాలు అసలే కొనవద్దు. -బిల్లుపై విక్రయదారుడి పేరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పేరు, గ్రామం పేరు. బ్యాచ్ నంబర్, గడువు తేదీ, నికర తూకం, నికర ధర, కంపెనీ పేరు తప్పనిసరిగా నమోదు చేయాలి. -బిల్లులను పంటకాలం పూర్తయ్యే దాకా దాచుకోవాలి. -అరువు పద్ధతిలో కొనుగోలు చేసినప్పటికీ బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి. -బిల్లులను పంటకాలం పూర్తయ్యే వరకు దాచిపెట్టాలి. -విత్తనాలు తీసుకున్న వెంటనే మొలక శాతాన్ని తీసుకొవాలి. మొలక శాతం సంతృప్తిగా ఉన్న విత్తనాలు వాడాలి. పురుగు మందులు, ఎరువుల కొనుగోలులో.. -వ్యవసాయ, ఉద్యానవన శాఖల శాస్త్రవేత్తలు సూచించిన మందులను మాత్రమే వాడాలి. -లైసెన్స్ ఉన్న దుకాణాల్లోనే ఎరువులు కొనుగోలు చే యాలి. వాటి బిల్లులు, ఖాళీ సంచులు పంటకాలం పూర్తయ్యేదాకా ఉంచుకొవాలి. l కొనుగోలు సమయంలో డీలర్ రశీదులో రైతు విధిగా సంతకం చేయాలి. -ప్రామాణిక పోషకాల వివరాలు, ఉత్పత్తి సంస్థ, ఉత్ప త్తి దారుడి పేరు కచ్చితంగా ఉండాలి. -మిషన్ కుట్టుతో ఉన్న ఎరువుల సంచినే తీసుకొవాలి, ఒకవేళ చేతి కుట్టుతో ఉంటే సీసం సీల్ ఉందో లేదో చూసువాలి. -నిల్వ ఉంచిన వాటిని అసలే వాడొద్దు. -మందుల డబ్బాలపై వజ్రాకారంలో స్థాయిలో తెలిపే రంగులు ఉంటాయి. -అత్యంత విషపూరిత నీలం రంగు, స్వల్ప విషపూరితమైతే ఆకు పచ్చరంగు గుర్తులు ఉంటాయి. -మందులు రెండు, మూడు రకాలు కలిపి వాడరాదు. -చిల్లుపడిన, చిరిగిన బస్తాలోని ఎరువులను కొనుగోలు చేయరాదు. -ఎరువుల నాణ్యతపై అనుమానాలుంటే వెంటనే వ్యవసాయాధికారుల సహకారంతో ఎరువులను పరీక్షలకు పంపాలి. నకిలీ విత్తనాలను అమ్మేవారిని గుర్తించి చర్యలు - జిల్లా వ్యవసాయశాఖ అధికారి సుజాత ఇప్పటికే గ్రామాలలోని రైతులకు పంట సాగుపై వ్యవసాయ అధికారులు పలు సూచనలు, సలహాలు అందిస్తున్నారు. ఈ ఏడాది వర్షాకాలం సీజన్ పూర్తి కాకముం దే విత్తన విక్రయదారులు కొంత డబ్బు ఆశకు రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తుంటారు. గ్రామాలకు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి విత్తనాలు, ఎరువులు క్రిమిసంహారక మందులు తక్కువ ధరకే అందిస్తామని వస్తే అధికారులకు, పోలీసులకు సమాచారం అందించాలని, ఏ విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు ఎక్క డ కొన్న వాటికి రశీదు తీసుకోవాలని, పంట కాలం పూర్తియ్యేవరకు వాటిని జాగ్రత్తగా తీసిపెట్టుకోవాలి. నకి లీ విత్తనాలు పత్తి విత్తనాలలోనే ఎక్కువగా ఉంటుంది. మన జిల్లాలో పత్తి పంట సాగు తక్కువగానే ఉంటుంది. అందుకు విత్తనాలలో నకిలీ బెడద తక్కువగా ఉం టుంది. ఎరువులు ఈ పాస్ మిషన్ ద్వారా అమ్మకాలు జరుగుతున్నాయి కాబట్టి వాటిలో కూడా నకిలీ తక్కువగా ఉండటానికి అవకాశం ఉంది. క్రిమిసంహారక మందులు విషయంలో రైతులు తగు జాగ్రత్త వహిస్తే చాలు, అదేవిధం గా ఈ క్రింది విషయాలను రైతులు గ్రహిస్తే నకిలీ బెడద నుంచి రైతులు జాగ్రత్త పడుతారు. పీడీ యాక్ట్ నమోదు చేస్తాం.. జిల్లా పరిధిలో నకిలీ విత్తనాలు విక్రయాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులను నమోదు చేస్తాం. రైతులను, శ్రమజీవులను మోసం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. రాబోవు 30 రోజు ల లక్ష్యంగా నకిలీ విత్తనాల రహిత వనపర్తి జిల్లాగా గుర్తింపు తీసుకోని రావడంలో పోలీసు అధికారులు సిబ్బంది పూర్తి స్థాయిలో కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రైతులు నష్టపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. - ఎస్పీ అపూర్వరావు

Related Stories: