27న అధ్యాపకుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ

హిమాయత్‌నగర్ : నారాయణగూడలోని బాబుజగ్జీవన్‌రామ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ కోర్సులోని స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్‌లో ఖాళీగా ఉన్న రెండు అధ్యాపకుల పోస్టులను భర్తీ చేసేందుకు ఈ నెల 27న కళాశాల ఆవరణలో ఉదయం 11గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బాల భాస్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పీజీలో ఎంఎస్సీ, స్టాటిస్టిక్స్‌లో 55శాతం మార్కులతో పాసై ఉండాలని, నెట్, స్లెట్, ఎంఫిల్ పీహెచ్‌డీ వంటి అదనపు విద్యార్హతలున్న వారు అర్హులని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటాతో ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు.

Related Stories: