కరీంనగర్‌లో వాకో ఇండియా కిక్ బాక్సింగ్ టోర్నీ

boxing కరీంనగర్ స్పోర్ట్స్: జాతీయ వాకో ఇండియా కిక్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ ట్రోఫీని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆవిష్కరించారు. కరీంనగర్ వేదికగా సెప్టెంబర్ 17 నుంచి 20 వరకు జరుగనున్న ఈ పోటీల్లో దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన కిక్ బాక్సర్లు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారత కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేడెట్, జాతీయ స్థాయి జూనియర్ పోటీలు మొదటిసారిగా కరీంనగర్‌లో నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టోర్నీ చైర్మన్ శ్రీనివాస్, చీఫ్ ఆర్గనైజర్ ఆర్. ప్రసన్నకృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు, తెలంగాణ వాకో ఇండియా కిక్ బాక్సింగ్ ప్రధాన కార్యదర్శి మహిపాల్, ఉపాధ్యక్షుడు బాలాజీ, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.