మీ స్పందన కోసం ఎదురు చూస్తుంటా: తాప్సీ

హైదరాబాద్: మహిళా ప్రేక్షకుల స్పందన కోసం తాను ఎదురు చూస్తున్నట్లు నటీ తాప్సీ తెలిపింది. ఆమె నటించిన నామ్‌షబానా మూవీ విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు, తాస్పీ నటనకు ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. కాగా యువకులకు తాప్సీ ట్విట్టర్ ద్వారా ఓ సందేశాన్ని ఇచ్చింది. అక్కాచెల్లెల్లు, భార్య, తల్లితో కలిసి మూవీని చూడాల్సిందిగా కోరింది. అనంతరం సినిమాపై వారి స్పందనను తనకోసం రికార్డు చేసి పంపించాల్సిందిగా కోరింది. ప్రేమించిన వ్యక్తి హత్యకు ప్రతీకారం తీర్చుకునే సీక్రెట్ ఏజెంట్ పాత్రలో తాప్సీ మూవీలో నటించింది.

Related Stories: